celebrations | ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

celebrations | ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
celebrations | చింతపల్లి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) జన్మదిన వేడుకలను చింతపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని దేవరకొండ నియోజకవర్గ నాయకులలు పానగంటి రాములు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్(Ambedkar) విగ్రహం వద్ద జన్మదిన వేడుకలు(birthday celebrations) ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు చింతపల్లి నూతన సర్పంచ్ కాసరపు శ్వేత శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గోవింద్ యాదగిరి, ఎం.యాదగిరి, జానీ, జావేద్, గజ్జెల మల్లారెడ్డి, మహమ్మద్ జహంగీర్, ఎర్ర జగన్, ఎలిమినేటి నరసింహ, నల్లవెల్లి సదానందం, భోగరాజు మధుసూదన్, కోటేష్, కొప్పుల శ్రీను, వందనపు ఆంజనేయులు, నరేష్, కొప్పుల ఆర్.కె, కొప్పుల శ్రీనాథ్, జాఫర్, ఎర్ర నవీన్, అబ్బాస్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.
