ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని రహత్ నగర్ (కొత్తతాండ) గ్రామంలో గురువారం సోషల్ మీడియా వారియర్స్ భూక్య మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో యువకుల తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి యువతలో దేశభక్తి భావాలు రేకెత్తించారు.ర్యాలీ మొత్తం గ్రామంలో ప్రధాన వీధుల మీదుగా సాగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించింది.ర్యాలీలో పాల్గొన్న యువకులు శివాజీ మహారాజ్ వీరోచిత గాధలను స్మరించుకుంటూ ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా ప్రతిభ గురించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్ భూక్య మోహన్ నాయక్ మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత ముందుకు వెళ్లాలి, యువత శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరించాలని, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉప సర్పంచ్ సేవాలాల్ నాయక్, వీడిసి అధ్యక్షుడు గోపాల్ నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు రాజు, వార్డ్ మెంబర్ భుక్యా సేబిలాల్, కొత్త తండా ఉప సర్పంచ్ శోభనాయక్ మాజీ సర్పంచ్ రాజు నాయక్, విజేందర్ నాయక్, రవి, మంగ్య నాయక్, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…..
