సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
సీని నటుడు ప్రకాశ్‌రాజ్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఓటర్ల చెకింగ్ చేస్తున్నారని.. SIR వచ్చే ముందు ఎవరీకి కూడా తెలియదని అన్నారు. బతికి ఉంటే ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నారా అని మండిపడ్డారు.
అక్రమ చొరబాటుదారులుంటే ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నారని నిలదీశారు. చొరబాట్లపై కేంద్ర హోంశాఖ ఏం చర్యలు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు. ఓటర్ల షిఫ్టింగ్ జరిగితే.. మొత్తంగా ఓటర్ల సంఖ్య తగ్గొద్దు కదా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు అందుబాటులో లేకపోతే ఓటు తీసేస్తారా అంటూ మండిపడ్డారు. ఉపాధి కోసం వలస వెళ్తే.. ఇంట్లో లేరని ఓట్లు తొలగించారని ఆరోపించారు. దళితులు, ముస్లింల ఓట్లు తొలగించడమే వారి ప్రధాన అజెండా అంటూ ప్రకాశ్ రాజ్ తీవ్రవిమర్శలు చేశారు.
