CC roads | ప్రజాసేవే నా సంకల్పం

CC roads | ప్రజాసేవే నా సంకల్పం
- జాగీర్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడాల లక్ష్మణ్
CC roads | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో మీ ముందుకు వచ్చానని జాగీర్యాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడాల లక్ష్మణ్ అన్నారు. ఇవాళ మండలంలో జాగీర్యాల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను సర్పంచ్ గా పోటీలో పాల్గొంటున్నాను. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
గ్రామాభివృద్ధి కోసం మరింత అభివృద్ధి చేస్తాను.. సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. గెలిచిన వెంటనే నియోజకవర్గ ఇన్చార్జ్(in charge) ముత్యాల సునీల్ కుమార్ సహాయ సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామంలో నెలకొన్న సమస్య, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల(CC roads)తో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.
తనను గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజలకు సేవచేస్తా తప్పా తన స్వార్థం కోసం మాత్రం పనిచెయ్యనని తెలిపారు. తనను ఆదరించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని ఓటర్లకు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, మద్దతుదారులు, తదితరులు పాల్గొన్నారు.
