రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ లో రూ.10 లక్షలతో సీసీ రోడ్ పనులను ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి కలిసి గురువారం ప్రారంభించారు.

సీసీ రోడ్ పనులకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా నిధులను మంజూర్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి ఈ సందర్భంగా గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply