Tuesday, November 26, 2024

Cartoon Special | చవితి పండుగకు సరదా కార్టూన్లు.. జర నవ్వుకోండి ప్లీజ్​!

కార్టూన్లంటే చూడగానే అందరినీ నవ్వుకునేలా చేస్తాయి. ఎంత సీరియస్​ గా ఉన్న వారైనా సరే కార్టూన్​ని చూడగానే లోలోన ముసిముసిగా అయినా నవ్వుకోక మానరు. అదిగో అవే అసలు సిసలు నవ్వుల బొమ్మలు. మనం ఏ భాష వాళ్లమైనా ఓ కార్టూనిస్టు వేసిన బొమ్మచూడగానే దాని భావం ఇట్టే అర్ధమై పోతుంది. అలాటి కార్టూన్లనే సైలెంట్ కార్టూన్లంటారు. ఈ చవితి పండుగకు కొన్ని స్పెషల్​ కార్టూన్లు మీకోసమే..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రఖ్యాత కార్టూనిస్ట్ నల్లాన్ చక్రవర్తుల మధుసూదనాచార్యులు (అందరూ ముద్దుగా పిలిచుకునే మాధవ్)​ ఆంధ్రప్రభ దినపత్రిక కోసం పనిచేస్తున్నారు. ప్రతి అకేషన్​కి స్పెషల్​ కార్టూన్లను గీసి ఇలా అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతారు. అందులో చాలామటుకు రాజకీయ, సామాజిక అంశాలను ప్రతిబింబేంచే కార్టూన్లే ఉంటాయి. ప్రస్తుత రాజకీయ పోకడలు, సామాజిక స్థితిగతులన్నీ కూడా మాధవ్​ కార్టూన్లలో ఇట్టే గమనించొచ్చు. ఈ వినాయక చవితి పండుగకు బొజ్జ గణపయ్య, తన వాహనమైన ఎలుకపై ఊరేగుతూ వస్తుంటే… వారి మధ్య జరిగే రక రకాల సంభాషణలు ఎలా ఉంటాయో ఈ కార్టూన్లలో చూపించారు మాధవ్​. మరి, మీరూ వాటిని చూసి కాస్త నవ్వుకోండి!

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement