ఇంద్రనగర్‌లో కార్డ్ అండ్ సెర్చ్
పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం
వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహమేరా
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డు ఇంద్రనగర్ కరీంనగర్ కాలనీలో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పోలీసులు కార్డ్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. సరైన దృవపత్రాలు లేని భారీ వాహనాలను ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహమేరా మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. సరైన ధ్రువపుత్ర లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని వాటి ధ్రువపత్రాలు చూయించి తీసుకువెళ్లాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య సీఐ రఘుకుమార్ వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
