హైవేపై కారు దగ్ధం.. తప్పిన ప్రాణనష్టం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామం వద్ద ఆదివారం కారు దగ్ధమైంది.
విజయవాడ నుంచి కంచికచర్ల వైపు వెళ్తున్నా కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేయగా లోపల ఉన్నవారు కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
