Candidate | ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి పరుస్తా

Candidate | ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి పరుస్తా

  • సర్పంచ్ అభ్యర్థి కూడావత్ వంశీ

Candidate | అచ్చంపేట, ఆంధ్రప్రభ : బల్మూరు మండలం, రామోజీ పల్లి గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోడావత్ వంశీ కోరారు. ఈ మేరకు రామాజీ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలోని అభివృద్ధి సాధ్యమవుతుందని, మహిళలకు స్త్రీ శక్తి పథకం, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు రవాణా, రూ. 500 లకే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లతో పాటు అనేక పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో రామాజీ పల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేకూరేలా వ్యవహరిస్తూ, గ్రామ అభివృద్ధికి అనుక్షణం పాటుపడతానని అన్నారు. డిసెంబర్ 17న జరిగే మూడవ విడత స్థానిక ఎన్నికలలో రామాజీ పల్లి గ్రామ సర్పంచ్ నైన తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply