Canals Roads | అభివృద్ధి చేసి చూపిస్తా..

Canals Roads | అభివృద్ధి చేసి చూపిస్తా..

Canals Roads | గాంధారి, ఆంధ్రప్రభ : సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని, గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గొల్ల కల్పన, కిష్టయ్య గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోతంగల్ కలాన్ గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే.. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, అన్ని గల్లీల్లో మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు వేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, గ్రామంలోని అరులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య, విత్తంతు పింఛన్లతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని గ్రామస్తులకు ఆమె మాట ఇస్తున్నారు.

గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా ఉంచడానికి, గ్రామంలోని అన్ని వార్డుల్లో రోడ్ల పై చెత్తాచెదారం లేకుండా ప్రతిరోజు పారిశుద్య పనులను చేయించడంతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానీటేషన్ పనులు చేయించడంతో పాటు, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తాను అన్నారు. సంవత్సరానికి ఒకసారి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయిస్తానని.. గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తు పై వేసి, పోతంగల్ కలాన్ గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని.. గొల్ల కల్పన, కిష్టయ్య గ్రామస్తులను కోరుతున్నారు.

Leave a Reply