1 వ వార్డులో ప్రచార హోరు…అభ్యర్థి వెంకన్న జోరు

1 వ వార్డులో ప్రచార హోరు…అభ్యర్థి వెంకన్న జోరు

  • ప్రచార పర్వంలో …పల్లెర్ల ముందంజ
  • ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థి వెంకన్న

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 1 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న ప్రచార పర్వంలో ముందంజలో కొనసాగుతున్నారు. తనకు ఒక్క సారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే… వార్డులో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని ఓటర్లకు విన్నవిస్తున్నారు.ఈ నెల 11 న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 1 వ వార్డు ఓటర్లు చెయ్యి గుర్తు కు ఓటేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని …తనను కౌన్సిలర్ గా గెలిస్తే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.ఇప్పటికే వార్డులో వందలాది మంది ఓటర్ల తో నిత్యం ఇంటింటి ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూన్నారు.ఈ వార్డులో ఎమ్మెల్యే సామెల్ సైతం ప్రచారం నిర్వహించారు. ఎక్కడ విన్నా..పల్లెర్ల వెంకన్న గెలుపు పై జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి.12 వార్డుల్లో… 1 వ వార్డ్ లో పల్లెర్ల వెంకన్న కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ తొలి బోణీ కొడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply