16వ వార్డులో ప్రచార హోరు

16వ వార్డులో ప్రచార హోరు

  • దూసుకుపోతున్న స్వంత్రత్య అభ్యర్థి గుగులోత్ అరుణ్ లాల్
  • ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన
  • గెలుపు ఖాయం అంటున్న ప్రజానీకం
  • యువ నాయకుడిగా మీ ముందుకు వస్తున్నాడు
  • తనను ఆశీర్వదించి.. కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థన

స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రాజకీయాల్లో యువత అడుగు పెడితే మార్పు తప్పదని నమ్మకంతో ముందుకు వచ్చిన యువ నాయ కుడు స్వతంత్ర్య అభ్యర్థి గుగులోత్ అరుణ్ లాల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించడానికి యువ నాయకుడిగా మీ ముందుకు వస్తున్నాడు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేప థ్యంలో 16వ వార్డులో జరుగుతున్న ఇంటింటి ప్రచారంలో అరుణ్ లాల్ యువతతో కలిసి ముందంజలో నిలిచారు.యువ నాయ కుడిగా మీ ముందుకు వచ్చాను…నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్‌గా గెలిపించండి అంటూ ప్రజలను ఆత్మీయంగా కలుస్తూ విశేష స్పందన పొందుతున్నా రు.

శుక్రవారం పెద్ద ఎత్తున యువత, స్థానికులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అంటూ వినయంగా విన్నవిస్తున్నారు. అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆశయానికి ప్రతీకగా అరుణ్ లాల్ నిలుస్తుండటంతో యువత వస్తే పాలన మారుతుంది…అందుకే అరుణ్ వచ్చాడు అని ప్రజలు చర్చించు కుంటున్నారు.

Leave a Reply