Campaign | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధి రామానుజగూడెం గ్రామపంచాయతీ సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గొగ్గల బుచ్చయ్యదొర ప్రచారంలో ఊహకందని తరహాలో దూసుకుపోతూ ముందంజలో ఉన్నారు. ఎన్నికల్లో తనకు వచ్చిన ఉంగరం గుర్తుపై మీఅమూల్యమైన ఓటేయాలని రాయిలంక, వలసల్ల, తునికిబండల, రామంజిగూడెం పలు గ్రామాల్లోని ప్రజలతో మమేకమై స్నేహభావం పెంపొందించుకుంటూ ఓటర్లను కలుసుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందడుగుతో ఓటర్లను అభ్యర్థించారు.
సర్పంచ్ అభ్యర్థి బుచ్చయ్య దొర నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని మంచికి మారుపేరు, మనసున్న మకుటం రాజు వ్యక్తిత్వం కలిగిన బుచ్చయ్య దొర ప్రజలందరి మన్ననలు పొందుకున్నారు. సిపిఐ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై ఓటు వేయాలనే ప్రచారంతో మీముందుకు వస్తున్నానని, గ్రామ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధిపై అనుభవం ఉన్నవ్యక్తి, త్యాగశీలి నిరాడంబరతతో జీవిస్తూ, చిరునవ్వులతో అభిమానులను పలకరించే మనస్తత్వం కలిగిన గొగ్గల బుచ్చయ్య సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదరించి ఆశీర్వదించాలని, ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదే స్ఫూర్తితో భద్రాద్రి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా సలహాలు, సూచనల మేరకు రామంజిగూడెం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఉంగరం గుర్తును అందరి గుండెల్లో గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

