Campaign | మహిళలతో ప్రత్యేక ప్రచారం..

Campaign | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి మండల పరిధిలోని 12వ వార్డులో మహిళలు పెద్దఎత్తున వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న పొలానికి స్థానిక నాయకులు ప్రత్యేకంగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. నానిన నీటి మడులో నాట్లు నాటుతున్న మహిళా కూలీల(Women workers)తో మాట్లాడిన నాయకులు, గ్రామ అభివృద్ధి–వ్యవసాయ సదుపాయాల పై తమ సంకల్పాన్ని తెలియజేశారు. మహిళల శ్రమతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని, రైతు కుటుంబాల పురోభివృద్ధి(development)కి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని నాయకులు పేర్కొన్నారు. కూలీల పరిస్థితులు, సాగునీటి సమస్యలు, ఎరువుల లభ్యత వంటి అంశాలను మహిళలు వారికి వివరించడంతో, ఆ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పొలంలో మహిళలతో కలిసి నిలబడి వారి పని తీరు(Work style)ను ప్రశంసించిన నాయకులకు స్థానిక ప్రజల్లో విశేష స్పందన వచ్చింది.
