ఢిల్లీ : ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (సీసీఎస్) భేటీ కానుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన వారం రోజుల్లో సీసీఎస్ సమావేశం కావడం ఇది రెండోసారి. ఈనెల 23న ప్రధాని నివాసంలో కమిటీ సమావేశమై భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు నిర్వహించబోయే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Delhi | రేపు క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ
