బీబీనగర్, ఆంధ్రప్రభ : కనీ.. పెంచిన తల్లిని ఓ కసాయి కొడుకు కొట్టి చంపిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో చోటు చేసుకుంది. కొత్త తండాలో భానోతు శ్రీను తన భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిసి చేవెళ్లలో నివాసం ఉంటున్నాడు.
ఈక్రమంలో ఆమెతో గొడవపడిన శ్రీను స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి బానోతు భోజు(56) కుమారుడిని మందలించింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీను తల్లిని కర్రతో తలపై బలంగా కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.