Saturday, November 16, 2024

Zomato | సినిమా టిక్కెట్లు, డైనింగ్‌ కోసం జొమాటో కొత్త యాప్‌

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే క్విక్‌ కామర్స్‌ విభాగంలో రాణిస్తున్న సంస్థ తాజాగా ఇతర రంగాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. దీనికోసం డిస్ట్రిక్ట్‌ పేరిట కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. దీని సాయంతో టిక్కెట్‌ బుకింగ్‌, డైనింగ్‌తోపాటు అనేక రకాల సేవల్ని యూజర్లకు అందించనుంది.

జొమాటో తాజా యాప్‌లో సినిమా టిక్కెట్లు, ఈవెంట్ల కోసం టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. స్పోర్ట్‌ ్స టికెటింగ్‌, లైవ్‌షోలు , షాపింగ్‌, డైనింగ్‌ సేవలనూ ఈ యాప్‌లో జోడించింది. ఈ ఏడాది ఆగస్టులోనే పేటీఎం నుంచి టిక్కెటింగ్‌ బిజినెస్‌ను రూ.2,048 కోట్లకు జొమాటో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సేవలను ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement