వరుసగా ఆరురోజులపాటు లాభాల బాటలో పరుగుపెట్టిన దేశీయ మార్కెట్లు సోమవారంనాడు నష్టాల చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 306 పాయింట్లు కోల్పోయి 55,766 వద్ద స్థిరపడగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 16,631 వద్ద ముగిసింది. సోమవారంనాటి ట్రేడింగ్‌లో ఒక దశలో నిఫ్టీ 16,564కు పతనమై తరువాత కొద్దిగా కోలుకుంది. కాగా జొమాటో షేర్ల విలువ భారీగా పతనమైంది. ఏకంగా 11 శాతం మేర జొమాటో నష్టాలు చవిచూసింది. రిల్ కూడా 3 శాతం మేర నష్టపోయింది.
టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, అప్పోలో హాస్పిటల్స్, యూపీఎల్, హిండాల్కో, హెచ్‌సీఎల్ టెక్, విప్రో 1-3 శాతం మేర లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, రిల్, ఓఎన్‌జీసీ, మారుతి సుజికి, కోటక్ బ్యాంక్, ఈషిర్ మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్, 1.5 నుంచి 4 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.7 శాతం నష్టపోగా నిఫ్టీ మెటల్ 1.5 శాతం మేర లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌కాప్ ఇండెక్స్ 0.03 శాతం మేర లాభపడగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.13 శాతం పతనమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.