Thursday, November 21, 2024

భారత్‌ మార్కెట్లోకి వైఎం3 సిరీస్‌ ట్రాక్టర్లు

ప్రఖ్యాత ట్రాక్టర్స్‌ తయారీసంస్థ ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెట్‌ సోలిస్‌ యాన్మార్‌ తమ వైఎం3 సిరీస్‌ ట్రాక్టర్లను భారత్‌లో విడుదల చేసింది. అంతర్జాతీయంగా 4వీల్‌ డ్రైవ్‌ సంస్థగా ఖ్యాతిగాంచిన సోలిస్‌ యాన్మార్‌ రెండు నూతన ట్రాక్టర్లు వైఎం 342ఎ, వైఎం 348ఎగా ప్రవేశపెట్టింది. భారత్‌లో విడుదల కాకముందే వైఎం3 ట్రాక్టర్‌ శ్రేణి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. ఈ ట్రాక్టర్లను థాయ్‌ల్యాండ్‌తోపాటు ఆగ్నేయ ఆసియా దేశాలు, యూరప్‌,

బ్రెజిల్‌తోపాటు యూఎస్‌ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. జపనీస్‌ ఇంజిన్‌ టెక్నాలజీతో ఈ ట్రాక్టర్లను రూపొందించారు. భారత మార్కెట్లో ఈ ట్రాక్టర్లను విడుదల చేసిన సందర్భంగా ఐటీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమణ్‌ మిట్టల్‌ మాట్లాడుతూ సోలిస్‌ ట్రాక్టర్ల శ్రేణిని 2019లో విడుదల చేసిననాటి నుంచి అపూర్వ ఆదరణ లభించిందన్నారు. తాజాగా యాన్మార్‌ ట్రాక్టర్‌ శ్రేణిని వైఎం3 ట్రాక్టర్‌ 4డబ్ల్యూడీ సిరీస్‌తో విడుదల చేస్తున్నామన్నారు. ఈ ట్రాక్టర్లను ప్రపంచంలో అత్యుత్తమైన సూపర్‌నోవా ఇంజిన్‌తో తీర్చిదిద్దామన్నారు. రైతుల ప్రత్యేక అవసరాలను తీర్చేవిధంగా నూతన ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నమని ఆయన తెలిపారు. యాన్మార్‌ హోల్డింగ్స్‌ కో లిమిటెడ్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అకిహికో హిరావోకా మాట్లాడుతూ సోలీస్‌(ఐటీఎల్‌)కు భాగస్వామిగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ట్రాక్టర్లను పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఉన్న ఐటీఎల్‌ ట్రాక్టర్‌ తయారీ కేంద్రంలో తయారుచేస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement