Friday, November 15, 2024

Yamaha R3, MT-03 | యూత్‌ను ఊరిస్తున్న యమహా స్పొర్ట్స్ బైక్స్ !

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా భారత మార్కెట్లో యమహా YZF-R3, Yamaha MT-03 అనే రెండు స్పోర్ట్స్ బైక్‌లను విడుదల చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటించింది. 2023 Yamaha R3, MT-03 మోడల్స్ ధర రూ.4.6 లక్షలతో ప్రారంభమవుతుంది. కాగా, సుదీర్ఘ విరామం తర్వాత R3 మోడల్ భారతదేశంలో తిరిగి రాగా… MT-03 మోడల్ మొదటిసారిగా మార్కెట్లోకి ప్రవేశించింది.

రెండు బైకుల ధర ఎంతంటే..

యమహా ఆర్3 ధర రూ.4.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, యమహా ఎంటీ-03 ధర రూ. 4.65 లక్షల (ఎక్స్-షోరూమ్)తో వస్తుంది. 2023 యమహా ఆర్3, యమహా ఎంటీ-03కు పవర్ అందించే 321సీసీ లిక్విడ్-కూల్డ్ 4-స్ట్రోన్, ఇన్‌లైన్ టూ-సిలిండర్ మోటార్ కలిగి ఉన్నాయి. 42బీహెచ్‌పీ, 29.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లు తేలికపాటి డైమండ్ ఫ్రేమ్‌తో వచ్చాయి. యూఎస్‌డీ, మోనోక్రాస్ వెనుక సస్పెన్షన్ మధ్య సస్పెండ్, ముందువైపు 130ఎమ్ఎమ్ ప్రయాణాన్ని, వెనుకవైపు 125ఎమ్ఎమ్ ప్రయాణాన్ని అందిస్తాయి.

- Advertisement -

ఆర్3, ఎంటీ-3 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు..

2023 యమహా ఆర్3 పూర్తి ఫెయిరింగ్‌తో లీటర్-క్లాస్ వైజెడ్ఎఫ్-ఆర్1 నుంచి అనేక అంశాలను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, టర్న్ సిగ్నల్స్ అన్నీ ఎల్ఈడీ లైటింగ్‌ను కలిగి ఉంటాయి. ఆర్3 మోడల్ భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఆర్15 ఫీచర్ల మాదిరిగా ఉంది. ఎంటీ-03 స్ట్రీట్‌ఫైటర్ స్టైల్‌తో మిగిలిన ఎంటీ ఫ్యామిలీ నుంచి అదే డిజైన్‌తో వచ్చింది. దీనికి ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉంది. రెండు మోటార్‌సైకిళ్లకు బ్రేకింగ్ ముందువైపు 298ఎమ్ఎమ్ డిస్క్, వెనుకవైపు 220ఎమ్ఎమ్ డిస్క్ అమర్చారు.

2023 యమహా ఆర్3 ట్రాక్ ఓరియెంటెడ్, దాదాపు 50/50 ముందు, వెనుక బరువు కలిగి ఉంటుంది. హ్యాండిల్‌బార్ క్రౌన్ అల్యూమినియంతో తయారైంది. అయితే, ఏరోడైనమిక్స్ మోటార్‌సైకిల్ పర్పార్మెన్స్ మరింత మెరుగుపరుస్తుంది. యమహా ఆర్3 ఐకాన్ బ్లూ, యమహా బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.

అలాగే, ఎంటీ-03 కూడా మిడ్‌నైట్ సియాన్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్ల ధరలు ఒకే విధంగా ఉంటాయి. ఆసక్తి గల కస్టమర్‌లు తమ మోటార్‌సైకిళ్లను యమహా అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement