ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ రికార్డును క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఆగస్ట్ 2024 అమ్మకాలలో షియోమీ ఆపిల్ ని అధిగమించి….. ఆగస్టు 2024లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రెండో స్థానంలో ఉన్న యాపిల్ మూడో స్థానానికి పడిపోయింది. అయితే శాంసంగ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
అయితే షియోమీ రెండో స్థానానికి చేరుకోవడంలో వ్యూహాలు, వృద్ధి కారణం అయితే.. ఆపిల్ కొత్త ఉత్పత్తుల విడుదల కూడా కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్‌లు లాంచ్ అవుతున్నందున, ఆగస్టు నెలలో అమ్మకాలు తగ్గుతున్నాయని…. అయితే రానున్న నెలల్లో ఆపిల్ విక్రయాలు పుంజుకునే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.