స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో కొత్త ఫోన్ ను భారత్ మార్కెట్ లో విడుదల చేసింది. MI 11 లైట్ పేరుతో విడుదలైన ఈ ఫోన్ 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 157 గ్రాముల బరువు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G చిప్‌సెట్, 4,250 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎంఐ 11 లైట్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .21,999 కాగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ టస్కానీ కోరల్, వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ కలర్లలో లభిస్తుంది. ఎంఐ 11 లైట్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి రూ .1, 500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై రూ.1,500 ఇన్‌స్టాంట్ తగ్గింపు కూడా లభిస్తుంది. జూన్ 25వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో ప్రీ-ఆర్డర్ కోసం ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. జూన్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి కొత్త ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
MI 11 లైట్ ఫీచర్స్ ఇవే..
డిస్‌ప్లే: 6.55 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8+5 మెగా పిక్సెల్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4250mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11