Tuesday, November 26, 2024

ప్రపంచ కుబేరుల్లో నెం.2 అదానీ.. వెనుకబడ్డ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌

సంపదలో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నారు. అదానీ తాజాగా ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మాత్రమే ఉన్నారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానకి చేరుకున్నారు. ఈ స్థాయికి చేరిన మొదటి ఆసియా, భారత్‌ వ్యక్తి అదానీ. స్టాక్‌ మార్కెట్‌లో సంపద ప్రకారం కుబేరుల సంపద మారుతుంటుంది. అమెరికా మార్కెట్ల భారీ పతనంతో ఒక్క రోజులోనే అమెజాన్‌ అధినేత 80 వేల కోట్ల మేర నష్టపోయారు. దీంతో అదానీ వీరిని అధిగమించారు.

ప్రస్తుతం అదానీ సంపద 155.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. అగ్రస్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌ సంపద 273.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో టాప్‌ టెన్‌లో ఇద్దరు భారతీయ పారిశ్రామిక వేత్తలు చోటు దక్కించుకున్నారు. అదానీ తరువాత ముఖేష్‌ అంబానీ 92.2 బిలియన్‌ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు. అమేజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 149.7 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. 105.3 బిలియన్‌ డాలర్లతో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపడుకు బిల్‌ గేట్స్‌ 4వ స్థానంలో ఉన్నారు. 98.3 బిలియన్‌ డాలర్ల సంపదతో లారీ ఎల్సిన్‌ 5వ స్థానంలో నిలిచారు. 96.5 బిలియన్‌ డాలర్లతో స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ 6వ స్థానంలో ఉన్నారు.

గత నెలలోనే మూడో స్థానంలో ఉన్న బిల్‌ గేట్స్‌ను

అధికమించి మూడో స్థానానికి చేరుకున్నారు. నెల రోజులు కూడా గడవక ముందే అదానీ జట్‌ స్పీడ్‌తో రెండో స్థానికి చేరుకున్నారు. గత కొంత కాలంగా స్టాక్‌ మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్ల ధరలు పెరుగుతు వస్తున్నాయి. శుక్రవారం నాడు ఎలాన్‌ మస్క్‌, గౌతమ్‌ అదానీ కంపెనీల షేర్లు తప్ప మిగిలి న టాప్‌ 10లో ఉన్న కుబేరుల నికర సంపద తగ్గింది. శుక్రవారం నాడు అదానీ కంపెనీల నికర విలువ 5 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీని వల్లే ఆయన రెండో స్థానికి చేరుకోగలిగారు.
గురువారం నాడు స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ 20.11 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌లో 7 కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో నమోదై ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్టులు, అదానీ ట్రాన్స్‌మిషన్‌ వంటి షేర్ల విలువ ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. దీని వల్ల ఈ ఒక్క సంవత్సరంలోనే అదానీ సంపద 72 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది. కుబేరుల జాబితాలో ఉన్న 10 మందిలో 2022 సంవత్సరంలో కేవలం ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ సంపద మాత్రమే పెరిగింది.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో అదానీకి 75 శాతం వాటాలు ఉన్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 37 వజాతంచ అదారీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో 65 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 61 శాతం వాటాలు ఆయన పేరు మీద ఉన్నాయి. 2020 నుంచి అదానీకి చెందిన కొన్ని కంపెనీల షేర్లు వెయ్యి శాతానికి పైగా పెరిగాయి. అదానీ కుబేరుల జాబితాలో పై స్థానాలకు రావడానికి బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌లు భారీగా విరాళాలు ఇవ్వడం కూడా ఒక కారణమని బ్లూమ్‌బర్గ్‌ అభిప్రాయపడింది.
బిల్‌ గేట్స్‌ బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు 20 బిలియన్‌ డాలర్లు, వారెన్‌ బఫెట్‌ ఛారిటీ కార్యక్రమాలకు 35 బిలియన్‌ డాలర్లు ఇవ్వడంతో అదానీ వీరి కంటే ముందుకు వచ్చారు. వజ్రాల వ్యాపారం నుంచి కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన అదానీ ప్రారంభంలో వజ్రాల ట్రేడింగ్‌ చేశారు. బొగ్గు వ్యాపారంలోకి వచ్చిన తరువాత ఆయన సంపద పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన బొగ్గు గనులు, నౌకాశ్రాయాలు, విమానాశ్రయాలు, డేటా కేంద్రాలు, విద్యుత్‌ ఉత్పత్తి, సిటీ గ్యాస్‌ పంపిణీ, సిమెంట్‌ ఉత్పత్తి, గ్రీన్‌ గ్యాస్‌ ఉత్పత్తి, కాపర్‌ , అల్యూమినియం, చివరకు మీడియాలోనూ తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించారు.
సిమెంట్‌ వ్యాపారం కొడుకు చేతికి అదానీ గ్రూప్‌లో ఉన్న సిమెంట్‌ వ్యాపారాన్ని అదానీ పెద్ద కొడుకు కరణ్‌ అదానీ సారధ్యం వహించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదానీ గ్రూప్‌ 10 బిలియన్‌ డాలర్లతో అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌ను కొనుగోలు చేసింది. కరణ్‌ ప్రస్తుతం అదానీ ఫోర్ట్స్‌లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈ రెండు కంపెనీల కొనుగోలుతో దేశంలో సిమెంట్‌ ఉత్పత్తిలో అదానీ గ్రూప్‌ రెండో స్థానికి చేరుకుంది. అగ్రస్థానంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement