భారత జీడీపీ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. ద్రవ్యోల్భణం పెరుగుతుండడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యం లో జీడీపీ వృద్ధి రేటును 7.5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఇప్పటికే వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించడం ఇది రెండో సారి.
2023లో మన దేశ వృద్ధి రేటును 8 శాతంగా అంతకు ముందు అంచనా వేసింది. దీనికంటే ముందు ఇది 8.7 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. 2021-22లె 8.7 శాతం వృద్ధి రేటుతో ఈ సంవత్సరం వృద్ధిరేటును పోల్చారు. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనమిక్ ప్రాసెస్ నివేదిక ప్రకారం వృద్ధి రేటు మందగించవచ్చని తేల్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.