Friday, November 22, 2024

ఫోర్బ్స్‌ జాబితాలో భారత సంతతి మహిళలు

ఫోర్బ్‌ తొమ్మిదవ సెల్ఫ్‌మేడ్‌ మహిళా సంపన్నుల జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్‌, నీర్జా సేధి, నేహా నార్ఖేడే, ఇంద్రానూయీ ఈ విశిష్ట జాబితాలో చేరారు. అమెరికాలో అత్యంత విజయవంతమైన, సగటు సందపన 124 బిలియన్‌ డాలర్లు కలిగిన 100 మంది మహిళా వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌ల సరసన ఈ నలుగురు నిలిచారు. వీరి సంపద గతేడాది కంటే 12 శాతం పెరిగింది. ఈ జాబితా మహిళల కృషి, విజయానికి నిదర్శనమని ఫోర్స్బ్‌ హల్త్‌ అసిస్టెంట్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ కెర్రీ డోలన్‌ అన్నారు.

మహిళలు రికార్డులు బ్రేక్‌ చేయడం, వారి అదృష్టాలతోపాటు ప్రభావాన్ని, శక్తిని పెంచుకోవడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం వివిధ పరిశ్రమలలోకి ప్రవేశించిన మహిళలు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుని గర్వకారణం అవుతున్నారు అని కెర్రీ డోలన్‌ అభిప్రాయపడ్డారు. తాజా జాబితాలో ఏబీసీ సప్లయి సంస్థకు చెందిన 76 ఏళ్ల డయాన్‌ హెడ్రిక్స్‌ 15 బిలియన్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.

- Advertisement -

జయశ్రీ ఉల్లాల్‌:
సిలికాన్‌ వ్యాలీ ఇంజనీర్‌ అయిన 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్‌ సిస్కో మాజీ నిపుణురాలు. ఫోర్బ్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 2.2 బిలియన్‌ డాలర్లు. జయశ్రీ ఉల్లాన్‌ 2008లో కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ అరిస్టా సంస్థకు సీఈవో పనిచేశారు. ఎలాంటి అమ్మకాలు లేని ఆసంస్థను పబ్లిక్‌ ట్రేడ్‌ కంపెనీగా అభివృద్ది చేశారు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆమె నేతృత్వంలో ఉన్న ఆ సంస్థ 2022లో 4.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని గడించింది. సరఫరా గొలుసు సవాళ్లు ఉన్నప్పటికీ గతేడాదితో పోల్చితే ఆ కంపెనీ ఆదాయం 48శాతం పెరిగినట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది.

నీర్జాసేథి : 68 ఏళ్ల నీర్జాసేథి నికర సంపద విలువ 990 మిలియన్‌ డాలర్లు. తాజా జాబితాలో ఆమె 25వ స్థానంలో ఉన్నారు. నీర్జా సేథి 1980లో మిచిగాన్‌లోని ట్రాయ్‌లో సొంత అపార్ట్‌మెంట్‌లో భర్త భరత్‌ దేశాయ్‌తో కలిససి ఐటీ కన్సల్టింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ సంస్థ సింటెట్‌ను స్థాపించారు. 2018లో ఆ సంస్థను ఫ్రెంచ్‌ ఐటీ సంస్థ అటోస్‌ ఎస్‌ఈకి 3.4 బిలియన్‌ డాలర్లకు విక్రయించారు.

నేహా నార్ఖెడే :
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి వ్యాపారవేత్తగా మారిన నేహా నార్ఖెడే ఫోర్బ్స్‌ సంపన్న మహిళల జాబితాలో 50వ ర్యాంకులో నిలిచారు. 38 ఏళ్ల నేహా నికర ఆస్తుల విలువ 520 మిలియన్‌ డాలర్లు. భర్తతో కలిసి 2021లో 20 మిలియన్‌ డాలర్ల నిధులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో కంపెనీ మోసాలను గుర్తించే ఓస్కీలార్‌ సంస్థను ప్రారంభించారు.

ఇంద్రానూయి:
67 ఏళ్ల ఇంద్రానూయి పరిచయం అక్కర్లేని మహిళ. చాలాఏళ్లు అమె పెప్సికో సీఈవో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రపంచ స్థాయిలో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో ఆమె 77వ స్థానంలో ఉన్నారు. ఆమె నికర సంపద విలువ 350 మిలియన్‌ డాలర్లు. భారతీయ నగరం చెన్నైలో జన్మించిన ఆమె, అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 12 ఏళ్లపాటు పెప్సికో సీఈవోగా ఉన్న ఆమె 2018లో ఆ పదవికి రాజీనామా చేశారు. 2019లో చై ర్‌పర్సన్‌గానూ పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అమెజాన్‌ సంస్థతోపాటు, హెల్త్‌టెక్‌ సంస్థ ఫిలిప్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. గతేడాది నవంబర్‌ నుంచి కుంభకోణంలో చిక్కుకున్న డ్యూయిష్‌ బ్యాంక్‌, గ్లోబల్‌ అడ్వయిజరీ కొత్త బోర్డులో సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement