Saturday, November 23, 2024

Wipro | 11 శాతం తగ్గిన విప్రో నికర లాభం..

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నికర లాభంలో 11 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 2,694 కోట్లుగా నమోదైనట్లు విప్రో తెలిపింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 3,052.9 కోట్లుగా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 2,646.3 కోట్లతో పోల్చితే మూడో త్రైమాసికంలో నికర లాభం పెరిగింది.

కంపెనీ బలమైన డీల్స్‌ కలిగి ఉందని తెలిపింది. వార్షిక ప్రతిపాదికన డీల్స్‌లో 20 శాతం వృద్ధి ఉన్నట్లు విప్రో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ థియరీ డెలాపోర్టే చెప్పారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో విప్రో ఆదాయం 23,290 కోట్లుతో పోల్చితే ఈ త్రైమాసికంలో ఆదాయం 22,205.1 కోట్లకు తగ్గింది. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 22,515.9 కోట్లుగా ఉంది. కంపెనీ ఐటీ బిజినెస్‌ ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో తగ్గింది. గత సంవత్సరం ఇదే కాలతో పోల్చితే ఈ త్రైమాసికంలో ఐటీ బిజినెస్‌ ఆదాయం 1.1 శాతం తగ్గి 22,151 కోట్లుగా ఉంది. షేరుకు ఒక రూపాయి మధ్యంత డివిడెండ్‌ను విప్రో ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement