ప్రభన్యూస్ : అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా అమేజాన్ పే విన్ ఏ సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇది కస్టమర్స్ తాము కోరుకున్న షాపింగ్ ఆఫర్ ను క్లెమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈసందర్భంగా అమేజాన్ పే రివార్డ్స్ అండ్ మర్చంట్ సర్వీసెస్ డైరెక్టర్ గిరీష్ కృష్ణన్ మాట్లాడుతూ… అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సమయంలో అమేజాన్ పేలో తాము తమ కస్టమర్స్ కు వినమ్రంగా సేవలు అందిస్తామన్నారు. సాటిలేని షాపింగ్ అనుభవం ఆనందించేలా వారికి వీలుకల్పిస్తామన్నారు. కస్టమర్స్ తమ జీవితాలకు విలువను చేర్చే నిరంతరంగా అర్థవంతమైన, భిన్నమైన డిజిటల్ చెల్లింపు అనుభవాలను కోరుతున్నారన్నారు. తమ కొత్త విన్ ఏ సూపర్ ఆఫర్ ప్రతిపాదన కస్టమర్స్ కు పండగ సీజన్ ను మరింత బహుమాన పూర్వకంగా చేస్తుందన్నారు. కస్టమర్స్ తాము కోరుకున్న ఉత్పత్తులు కోసం ఆఫర్స్ గెలుపొందవచ్చన్నారు. క్యాష్ బ్యాక్స్ కోసం వాటిని రిడీమ్ చేసుకోవచ్చన్నారు. ఒక నమ్మకమైన, సౌకర్యవంతమైన, బహుమాన పూర్వకమైన చెల్లింపు అనుభవాన్ని సమన్వయం చేయడానికి అలాంటి కస్టమర్ చొరవలను తీసుకురావడం కొనసాగిస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement