Saturday, November 23, 2024

ఎయిర్‌ ఇండియాలో వైడ్‌ బాడీ విమానాలు.. 2024 మార్చినాటికి అందుబాటులోకి

టాటా గ్రూప్‌కు చెందని ఎయిర్‌ ఇండియా 2024 మార్చి నాటికి వైడ్‌ బాడీ విమానాల సంఖ్యను 30 శాతం పెంచుకోవాలని నిర్ణయించింది. కొత్తగా 6 ఏ 350 విమానాలు, ఐదు బీ777-200ఎల్‌ఆర్‌ విమానాలు, 9 బీ777-300 ఈఆర్‌ విమానాలు మార్చి లోగా వస్తాయని ఎయిర్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాంప్‌బెల్‌ నిల్సన్‌ శుక్రవారం నాడు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు మొత్తం 125 విమానాలు ఉన్నాయి. వీటిలో 51 వైడ్‌బాడీ విమానాలు, 74 నారో బాడీ విమానాలు ఉన్నాయి. 2022లో ఎయిర్‌ ఇండియా 42 విమానాలను లీజ్‌కు తీసుకుంది.

ఈ సంవ్సతరం ఫిబ్రవరిలో ఎయిర్‌ ఇండియా 470 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో యూరోపియన్‌ కంపెనీ ఎయిర్‌ బస్‌కు 250 విమానాలు, అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీకి 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. ఎయిర్‌ బస్‌ నుంచి 40 ఏ 350 వైడ్‌బాడీ విమానాలు, 210 ఏ 320 నియో విమానాలను కొనుగోలు చేయనుంది. బోయింగ్‌ కంపెనీ నుంచి 10 వైడ్‌ బాడీ బీ777ఎక్స్‌ విమానాలు, 20 వైడ్‌ బాడీ బీ787 విమానాలు, 190 నారోబాడీ బీ737 మ్యాక్స్‌ విమానాలను ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement