Saturday, November 23, 2024

పాసింజర్‌ వాహనాల టోకు విక్రయాలు 92శాతం అప్‌

దేశీయంగా పాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు పుంజుకుంటున్నాయని భారత వాహన తయారీ దారుల సంఘం (ఎస్‌ఐఎఎం) వెల్లడించింది. కంపెనీ నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాల్లో 92శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 2021 సెప్టెంబర్‌లో 1,60,212 పీవీలు డీలర్లకు చేరగా, ఈ ఏడాది గతనెలలో ఈ సంఖ్య 3,07,389కి చేరింది. పండుగల సీజన్‌ దృష్ట్యా డీలర్ల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. సియామ్‌ గణాంకాల ప్రకారం, జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 38శాతం పెరిగాయి.

గతేడాది ఇదేసమయంnలో 7,41,442 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 10,26,3.9కి చేరాయి. సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల సరఫరా 13శాతం పెరిగింది. మొత్తంగా 17,35,499 యూనిట్లు వివిద కంపెనీల నుంచి సరఫరా అయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 15,37,604గా ఉంది. మోటార్‌ సైకిళ్లవిభాగంలో 18శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది 11,14,667 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 9శాతం పెరిగి 5,72,667 యూనిట్లకు చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement