మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతదేశంలో 71 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్ చేసింది. ఏ దేశంలోనైనా ఒకేసారి ఇన్ని అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేయడం ఇదే తొలిసారి. దేశంలో వాట్సాప్‌కు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కంప్లయన్స్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా ఈ నిషేధం విధించినట్టు వాట్సాప్ తెలిపింది.
కంపెనీ నిబంధనలకు విరుద్ధమైన కొన్ని కార్యకలాపాలు ఈ ఖాతాల్లో కనిపించాయపి వెల్లడించింది. ఇంతకు ముందు కూడా భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఇటువంటి ఖాతాలను నిషేధించింది వాట్సాప్. సెప్టెంబరులో వాట్సాప్ భారతదేశంలో రికార్డు స్థాయిలో 10,442 ఫిర్యాదులను అందుకుంది. వీటిలో 85 మందిపై చర్య తీసుకున్నారు. అంటే ఈ ఖాతాలు బ్యాన్ లేదా రీస్టోర్ చేశారు.