ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వాట్సాప్ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను తీసుకువస్తోంది. కొద్ది రోజుల క్రితం చాట్ ఫిల్టర్, స్క్రీన్ షాట్ బ్లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
ఈ కొత్త ఫీచర్‌తో వాయిస్ నోట్స్‌ని టెక్స్ట్‌గా మార్చుకునే అవకాశం ఉంది. స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి వాయిస్ మెసేజ్ లు టెక్స్ట్‌గా మార్చవచ్చు. వాయిస్ మెసేజ్ లను వినే పరిస్థితి లేనప్పుడు ఆ మెసేజ్ లను టెక్స్ట్ మెసేజ్ రూపంలో చదవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్స్ కు బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది.
లాంగ్ వీడియో ఫార్మాట్ లో స్టేటస్
దాంతో మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకనుంచి వాట్సాప్ స్టేటస్‌లో ఒక నిమిషం వీడియోలను అప్లోడ్ చేసే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం స్టేటస్‌లో 30 సెకన్ల వీడియో మాత్రమే అప్లోడ్ చేసే వీలుంది. లాంగ్ వీడియోలు కట్ కాకుండా ఈ కొత్త ఫీచర్ స్టేటస్ అప్లోడ్ సమయాన్ని పెంచే అవకాశం ఉంది.
వాట్సాప్ లో యూపీఐ సేవలు
అంతేకాకుండా యూపీఐపై సేవలపై కూడా వాట్సాప్ దృష్టి సారిస్తుంది. వాట్సాప్ పేమెంట్స్ సులభతరం చేసేందుకు ఓ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర ద్వారా.. పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్‌ను చాట్ ట్యాబ్ నుంచి నేరుగా ఇతరులకు సెండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాట్సాస్ ద్వారా పేమెంట్స్ చేయాలి అంటే సెట్టింగ్‌లలోకి వెళ్లాల్సి ఉంటుంది. రానున్న అప్డేట్లో ఇది సులభతరం కానుంది. QR కోడ్‌ను షేర్ చేసినప్పుడు ఫోన్ నంబర్‌కు బదులుగా వినియోగదారు పేరును చూపుతుంది.