హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ్స ఇండియా 350 సీసీ సెగ్మెంట్‌లో మరో కొత్త బౖౖెక్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో సీబీ 350, సీబీ 350 ఆర్‌ఎస్‌లు ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా కంపెనీ సీబీ 350ని విడుదల చేసింది. డిజైన్ విషయంలో పోటీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడళ్లను ఇది పోలి ఉంది. సీబీ 350 డీఎల్‌ఎక్స్ వేరియంట్ ధర 1.99 లక్షలు, డీఎల్‌ఎక్స్ ప్రో వేరియంట్ ధర 2.17 లక్షలు ఎక్స్‌షోరూమ్ ధరగా కంపెనీ నిర్ణయించింది.
కొత్త సీబీ 350 డిజైన్ హెన్స్ సీబీ 350 మాదిరిగానే ఉంది. కొత్త బైక్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేశారు. ప్రీషియస్ రెడ్ మెటాలిక్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలి క్,మ్యాట్ డ్యూన్ బ్రౌన్ వంటి ఐదు రంగుల్లో ఇది లభిస్తుంది. ఎల్‌ఈడీ ల్యాంప్, అనలాగ్ డిజిటల్ కన్సోల్, హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, హజార్డ్ ల్యాంప్‌తో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి ఫీచ ర్లు ఇందులో ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫోర్క్, నైట్రోజన్ ఛార్జ్‌డ్ డ్యుయల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి.