Thursday, September 12, 2024

Welspun | సిల్వర్ గెలుచుకున్న వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్

హైదరాబాద్, (ప్రభ న్యూస్) : నేషనల్ అవార్డ్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ 2023-24 రికగ్నిషన్ ప్రోగ్రామ్ వద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ విభాగంలో సిల్వర్ అవార్డుతో తాము గౌరవించబడ్డామని వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ వెల్లడించింది.

తయారీ ప్రక్రియల్లో ఆవిష్కరణ, కార్యాచరణ శ్రేష్ఠత, నాణ్యతను నిరంతరం కొనసాగించడంలో నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం. కాస్ట్ ఆప్టిమైజేషన్, ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మెరుగుదల, లీడ్ టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రతిభను ప్రోత్సహించటం వంటి విభాగాల్లో వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ అత్యుత్తమ ప్రయత్నాలను నేషనల్ అవార్డ్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ బృందం గుర్తించింది.

దేశవ్యాప్తంగా 19కు పైగా రాష్ట్రాల్లో 1000కి పైగా కర్మాగారాలను పరిశీలించి ఈ అవార్డు అందించారు. ఈసంద‌ర్భంగా వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడుతూ… ఆవిష్కరణ, శ్రేష్ఠత పట్ల త‌మ మహోన్నత నిబద్ధతకు గుర్తింపు పొందడం చాలా ఆనందంగా వుందన్నారు.

ఈ గుర్తింపుతో త‌మ వినియోగదారుల ప్రాంగణాలను మరింత సౌకర్య వంతంగా, పర్యావరణ అనుకూలంగా, అందంగా త‌మ అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫ్లోరింగ్ సొల్యూషన్స్ తో మార్చడానికి తాము స్థిరంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement