Friday, November 22, 2024

సరైన సమయంలోనే స్పందించాం.. ఉక్రెయిన్‌ యుద్ధంతో మారిన పరిస్థితి : ఆర్‌బీఐ

ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో తాము సకాలంలోనే స్పందించామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం తొందరపడినా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో ఆర్బీఐ ఆలస్యంగా చర్యలు తీసుకుందని మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఆర్బీఐ నిర్ధేశించిన ద్రవ్యోల్భణం టార్గెట్‌ కంటే అధికంగా ఉన్న సయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే సరిస్థితులు మరింత దిగజారాయని అరవింద్‌ సుబ్రమణ్యం విమర్శించారు. ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగానే ఆర్బీఐ చర్యలు తీసుకుందని శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి అవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నామని ముంబాయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివరించారు. కోవిడ్‌ ప్రభావంతో 2021లో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.6 శాతానికి క్షిణించిందని, ఈ సమయంలో ద్రవ్యోల్బణంపై దృష్టి సారించలేకపోయామన్నారు.

ఈ సంవత్సరం మార్చి నాటికి ఆర్థిక పరిస్థితులు కోవిడ్‌ ముందునాటికి చేరుకున్నాయని చెప్పారు. ఈ సమయంలోనే ద్రవ్యోల్బణం కట్టడికి నెమ్మదిగా చర్యలు తీసుకోవడం ప్రారంభించామని చెప్పారు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర 80 డాలర్లుగా ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకునే ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా అంచనా వేసినట్లు ఆయన వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో పరిస్థితులు మారిపోయాని తెలిపారు. ఆర్థిక రంగంలో భారీ టెక్‌ సంస్థలు ప్రవేశించడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యలను సమర్దవంతంగా ఎదుర్కొవాల్సి ఉందన్నారు. ఇలాంటి సంస్థలు సొంతంగానూ, భాగస్వాములతో కలిసి ఆర్థిక సేవలు అందిస్తున్నాయని చెప్పారు. దీని వల్ల క్రెడిట్‌ అసెస్‌మెంట్‌ కు కొత్త విధానాలను అనుసరించాల్సి వస్తుందన్నారు. రుణ యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తున్న వారు రికవరీకి అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఇష్టానుసారం కాల్స్‌ చేయడం, అభ్యంతరకర భాష ఉపయోగించడం వంటివాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్బీఐ వద్ద అనుమతి తీసుకోకుండా, రిజిస్ట్రర్‌ కాని సంస్థల నుంచే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement