Tuesday, November 26, 2024

ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయండి

తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు అనే సామెత గురించి వినే ఉంటారు. అంటే.. దేన్నీ గుడ్డిగా నమ్మేయడం మంచిది కాదని అర్థం. ఇప్పుడీ గోల ఎందుకంటే.. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఆండ్రాయిడ్ యాప్‌లన్నీ సేఫే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ అనే మాల్వేర్ విశ్లేషణ సంస్థ కొన్ని ఆండ్రాయిడ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లను గూగుల్ అలర్ట్ చేసింది. సైబర్ భద్రత దృష్ట్యా 9 యాప్‌లను గూగుల్ బ్యాన్ చేసింది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్స్ కానీ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయాలని కోరింది. గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్..

✤ పీఐపీ ఫొటో – PIP Photo (over 5.8 million downloads)
✤ ప్రాసెసింగ్ ఫొటో – Processing Photo (500K+ downloads)
✤ రబ్బిష్ క్లీనర్ – Rubbish Cleaner (100K+ downloads)
✤ ఇన్ వెల్ ఫిట్ నెస్ – Inwell Fitness(100K+ downloads)
✤ హారోస్కోప్ డైలీ – Horoscope Daily (100K+ downloads)
✤ యాప్ లాక్ కీప్ – App Lock Keep (50K+ downloads)
✤ లాక్ ఇట్ మాస్టర్ – Lockit Master (5K+ downloads)
✤ హారోస్కోప్ పై – Horoscope Pi (1,000 downloads)
✤ యాప్ లాక్ మేనేజర్ – App Lock Manager (less than 100 downloads)

ఇది కూడా చదవండి: వినియోగదారులకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్

Advertisement

తాజా వార్తలు

Advertisement