Friday, November 22, 2024

దేశ సమగ్రతకు వివో దెబ్బ.. ఢిల్లి కోర్టుకు తెలిపిన ఈడీ

దేశ అక్రమ లావాదేవీలతో ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం ద్వారా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతను దెబ్బతీసేందుకు వివో సంస్థ ప్రయత్నించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లి కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. హాంగ్‌కాంగ్‌లోని 22 సంస్థలకు అనుమానాస్ప చెల్లింపులు జరిగిన విషయాన్ని ఈడీ గుర్తించింది. ఆ సంస్థల ద్వారా వివో వేల కోట్ల రూపాయలను చైనాకు తరలించిందని ఈడీ ఆరోపించింది. ఆ మేరకు కేసు నమోదు చేసింది. వివో తరపున భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లో సేవలందిస్తున్న గ్రాండ్‌ ప్రాస్పెక్ట్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ అక్రమ చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరించిందని ఈడీ అనుమానిస్తోంది. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించింది.

ఈ అక్రమాలకు ఢిల్లికేంద్రంగా పనిచేస్తున్న ఒక చార్టెడ్‌ అక్కౌంటెంట్‌ సంస్థ సహకరించిందని గుర్తించింది. దేశంలోని పలు రాష్ట్రాలలో 22 సంస్థల పేరున కార్యాలయాలు ఏర్పాటు చేసి ఈ అక్రమాలకు తెరతీశారని పసిగట్టింది. దాదాపు 62వేల కోట్లకు మొత్తాన్ని చైనాకు అక్రమ మార్గాల్లో వివో తరలించిందన్నది ఈడీ అభియోగం. గత ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి దాడులు చేసిన నేపథ్యంలో వివో ఉన్నతాధికారులు ఝెంగ్‌షెన్‌, ఝాంగ్‌ జీ నేపాల్‌ మీదుగా దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement