Friday, November 22, 2024

IMPORTS | మాంగనీస్‌ దిగుమతిలో విశాఖ పోర్టు మరో రికార్డు..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : విశాఖ పోర్టు సరకు రవాణాలో మరో నూతన రికార్డును నెలకొల్పింది. జులై నెలలో అత్యధిక స్ధాయిలో మాంగనీస్‌ను దిగుమతి చేసుకుని, ఈ రికార్డును సృష్టించింది. జులై 2024లో 15 నౌకల ద్వారా 5,66,301 మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ను దిగుమతి చేయడం ద్వారా గత రికార్డులను తిరగరాసింది.

గతంలో మే 2024 లో 17 నౌకల ద్వారా దిగుమతి చేసుకున్న 4,37,270 మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ ఇప్పటి వరకూ ఒక నెలలో పోర్టు దిగుమతి చేసుకున్న, అత్యధిక మాంగనీస్‌ దిగుమతిగా రికార్డులలో ఉంది. విశాఖపట్నం పోర్టు అథారిటీ 90 ఏళ్ల చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచింది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల చైర్‌పర్సన్‌ డా ఎం అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు.

పోర్టు ఈ ఘనతను సాధించడంలో విశేష కృషి చేసిన ట్రాఫిక్‌ మేనేజర్‌ మరియు ఆతని సిబ్బందిని చైర్‌ పర్సన్‌ ప్రశంసించారు. పోర్టు సిబ్బంది ఇదే విధంగా కష్టించి పని చేయడం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన 90 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణాను చేరుకుంటు-ందనే విశ్వాసాన్ని చైర్‌పర్సన్‌ వ్యక్తం చేశారని, పోర్టు కార్యదరి టి. వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement