ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాఖ.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదిత్య బిర్లా క్యాపిటల్ కంపెనీ ఆదివారం ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌ను ఆదిత్య బిర్లా క్యాపిటల్ అందిస్తుంది. విశాఖకు బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. జూన్ 1 నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపడుతారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో చేరిన నెల రోజుల తరువాత.. విశాఖ ఫైనాన్షియల్ సర్వీస్ గ్రూప్‌లో మరో కీలక బాధ్యతను నిర్వహించనున్నారు. ప్రస్తుత సీఈఓ అజయ్ శ్రీనివాసన్ స్థానాన్ని జూన్ 1 నుంచి విశాఖ భర్తీ చేయనున్నారు.
కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ వివరించింది. విశాఖ నియామకాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ బోర్డు శనివారం ఆమోదించింది. విశాఖ.. చార్టెట్ అకౌంటెంట్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకులో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ హోల్‌సేల్ బ్యాంకింగ్ సేవలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె.. యాజమాన్య వ్యాపారం, మార్కెట్లు, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ వంటి ఇతర బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..