ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఈస్ట్ బెంగళూరులో ఓ విల్లాను కొనుగోలు చేశాడు. ఈ విల్లా ఖరీదు రూ.8కోట్లుగా ఉంది. వర్తూర్ హుబ్లిdలోని ఆదర్శ్ పామ్ రిట్రేట్‌లో ఈ విల్లా ఉంది. మొత్తం 6,918 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భూమిలో.. విల్లా 4,921 చదరపు అడుగులు బిల్డప్ ఏరియా ఉంటుంది. ఆదర్శ్ పామ్ రిట్రీట్ అనేది.. 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న 800 రెడ్ రూప్డ్ విక్టోరియన్ విల్లాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. 2018 నుంచి ఫ్లిఫ్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా కృష్ణమూర్తి కొనసాగుతున్నారు. అయితే విల్లా కొనుగోలు గురించి వివరణ కోరగా..ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. భారత్ విలాసవంతమైన ఇళ్లకు నెలవుగా మారింది. స్టార్టప్ సెక్టార్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. సెల్ఫ్ మేడ్ ఆల్ట్రా రిచ్ వ్యక్తిగత ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్నది. అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజ్యూవల్స్ (యూహెచ్‌ఎన్‌ఐలు) ఇళ్ల కొనుగోళ్లు 2022లో పెరిగాయి. చాలా మంది ఈ తరహా ఇళ్ల గురించి వెతుకుతున్నారని, లగ్జరీ ప్రాపర్టీలకు పెరిగిన డిమాండ్ కారణంగా.. ధరలు కూడా పెరిగాయని లగ్జరీ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అయిన ప్రాపర్టీ ఫస్ట్ వ్యవస్థాపకుడు భవేష్ కొఠారీ అభిప్రాయపడ్డారు.
బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్ సీఈఓకు విల్లా.. 8కోట్లతో కొనుగోలు
Advertisement
తాజా వార్తలు
Advertisement