Friday, November 22, 2024

క్యుఐపీ మార్గంలో 50 కోట్ల రూపాయలను సమీకరించిన వికాస్‌ లైఫ్‌కేర్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : వికాస్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ కంపెనీ బోర్డు ఇప్పుడు అర్హత కలిగిన సంస్ధాగత కొనుగోలు దారులు (క్యుఐబీలు)కు 12.50 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటుగా కేటాయించేందుకు అనుమతించింది. ఈ కంపెనీ ఇదే విషయాన్ని బౌర్సెస్‌కు తెలియజేసింది. ఈ అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యుఐపీ) ద్వారా వైవిధ్యీకరించబడిన లిస్టెడ్‌ సంస్ధ 50 కోట్ల రూపాయలను మదుపరుల నుంచి సమీకరించనుంది. వీరికి ఒక్కో షేర్‌కూ 3 రూపాయల ప్రీమియంతో పాటుగా నాలుగు రూపాయల చొప్పున షేర్‌ను కేటాయించనుంది.

క్యుఐపీలో కేవలం ముగ్గురు బిడ్డర్లు కేటాయించిన ఈక్విటీ షేర్ల మొత్తం అంటే 100 శాతంను ఎఫ్‌పీఐ విభాగం కింద సొంతం చేసుకున్నారు. ఫోర్బెస్‌ ఈఎంఎఫ్‌కు 5. 4 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 43.2 శాతం ఈక్విటీ షేర్లను కేటాయిస్తే, నోమురా సింగపూర్‌ లిమిటెడ్‌కు 4.4 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 35.2శాతం వాటాను కేటాయించారు. మిగిలిన 2.7 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 21.6 ను ఏజీ డైనమిక్‌ ఫండ్స్‌ లిమిటెడ్‌కు కేటాయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement