Saturday, November 23, 2024

వాహన విక్రయాలు రయ్‌రయ్‌.. న‌వ‌రాత్రోత్స‌వాల‌తో జోరు!

నవరాత్రి ఉత్సవాల సమయంలో వాహన విక్రయాల జోరు కొనసాగింది. దేశీయంగా 5.4 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని ఫెడరేషన్‌ఆఫ్‌ ఆటోమొబైల్‌ం డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఎడిఎ) వెల్లడించింది. గతేడాదితో పోల్చితే 57శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5వరకు జరిగిన విక్రయాల డేటాను ఎఫ్‌ఎడిఎ విడుదల చేసింది. దీనిప్రకారం గతేడాది 3,42,459 వాహనాలు విక్రయించగా, ఈసారి 4,66,128 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఇదే అత్యధికమని ఫెడరేషన్‌ అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ తెలిపారు.

ద్విచక్రవాహనాలు 3,69,020 అమ్ముడయ్యాయి. గతేడాది కంటే 52.35 శాతం అధికం. ప్రయాణికుల వాహనాలు గతేడాది 64,850 యూనిట్లు విక్రయించబడగా, ఈసారి 70 శాతం వృద్దితో 1,10,521 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఇక కమర్షియల్‌ వాహనాల అమ్మకాల్లోనూ 48.25 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది 22,437 యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రిచక్ర విభాగంలో 19,809 యూనిట్లు, ట్రాక్టర్ల విభాగంలో 17,440 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement