హైదరాబాద్, (ఆంధ్రప్రభ ): ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ ఎస్ఎఫ్ బీఎల్) తెలంగాణలోని వరంగల్‌లో తమ కొత్త బ్యాంకింగ్ అవుట్‌లెట్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆర్థిక సమ్మిళితను పెంపొందించడంతో పాటు తెలంగాణ ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను అందించడంలో బ్యాంక్ నిబద్ధతకు ఈ విస్తరణ నిదర్శనం.
ఈ ప్రారంభంతో బ్యాంక్ తెలంగాణలో 5 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లకు, 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ దేశవ్యాప్తంగా 986 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లకు చేరుకుంది.ఈ విస్తరణ గురించి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎండి అండ్ సీఈఓ గోవింద్ సింగ్ మాట్లాడుతూ…
‘‘సాంస్కృతికంగా గొప్ప, చారిత్రాత్మకమైన మహోన్నతమైన వరంగల్ నగరానికి తమ బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. వారసత్వం, వేగవంతమైన వృద్ధికి ప్రసిద్ధి చెందిన వరంగల్, తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించాలనే తమ వ్యూహంలో కీలక స్థానాన్ని సూచిస్తుందన్నారు.
ఈ కొత్త అవుట్‌లెట్ సమగ్ర శ్రేణి బ్యాంకింగ్ సేవలకు అనుకూలమైన అవకాశాలను అందించడమే కాకుండా స్థానిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడనుందన్నారు. ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక చేరికను ప్రోత్సహించడం ద్వారా వరంగల్ వాసులు, వ్యాపారాలను బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షలు, ఆర్థిక అవసరాలకు మద్దతునిస్తూ వరంగల్ అభివృద్ధి కథలో కీలక పాత్ర పోషించాలని తాము ఎదురుచూస్తున్నామన్నారు’’.