హైదరాబాద్ : హార్ట్ ఫెయిల్యూర్ నిర్వహణ కోసం సకుబిట్రిల్, వల్సార్టన్‌ల నిర్దిష్ట డోస్ కాంబినేషన్ అయిన ఆన్ఆర్నిని యూఎస్వీ ప్రై.లి.ప్రవేశపెట్టింది. ఒక్కో 50 ఎంజీ టాబ్లెట్‌కి రూ.8గా అందుబాటు ధరలో ఉంది. తక్కువ వ్యయంతో కూడుకున్న ఈ ఎంపిక భారతదేశంలో పెరుగుతున్న గుండె వైఫల్య కేసులను పరిష్కరిస్తుంది. ఇది చాలా అవసరమైన లక్షలాది మంది రోగులకు ప్రాణాలను రక్షించే సంరక్షణను అందిస్తుంది. యూఎస్వీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ తివారీ సరసమైన గుండె వైఫల్య చికిత్స మందుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హృద్రోగ సంరక్షణలో అగ్రగామిగా, బయోఈక్వివలెంట్ ఆన్ ఆర్నిని ప్రవేశపెట్టడం అనేది యూఎస్వీలో తమకు, గుండె వైఫల్యం చికిత్స సరసమైనది, అందుబాటులో ఉండే దిగా చూసేందుకు ఒక కీలకమైన చర్య అన్నారు. ప్రారంభ మోతాదు ఒక్కో టాబ్లెట్‌కు రూ.8 ధరతో రోగులు వారి మందులను నిలకడగా వాడుతూ ఉండటానికి ఆన్ఆర్ని సహాయ పడుతుందన్నారు. ఇది రోగులకు తరచుగా వారు తమ మోతాదులను దాటవేయడానికి దారితీసే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా పరిస్థితిని సమర్థవంతంగా నిర్వ హించడంలో కీలకంగా ఉంటుందన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను మెరుగు పరుస్తుందన్నారు.