హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన యూపిఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా రేపు (ఆగస్టు 10న) మూడు గంటల పాటు యూపీఐ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది.
బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు
UPI సేవలు నిలిపేస్తున్నారు.