Tuesday, November 26, 2024

గూగుల్‌ పేలో యూపీఐ లైట్ పిన్‌ లేకుండానే పేమెంట్స్‌

గూగుల్‌ పే యూజర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చింది. స్వల్ప మొత్తంలో చెల్లింపులకు ఉద్దేశించిన యూపీఐ లౖౖెట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫీచర్‌ తో 200 రూపాయల వరకు లావాదేవీలకు ఎలాంటి పిన్‌ నమోదు చేయాల్సిన అవసరంలేదు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌ పే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాయి.
యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లోకి గరిష్టంగా 2వేల రూపాయలు వరకు లోడ్‌ చేసుకోవచ్చు. పీక్‌ అవర్స్‌లోనూ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని గూగుల్‌ పే తెలిపింది.

- Advertisement -

యూపీఐ లైట్‌ లావాదేవీల వల్ల బ్యాంక్‌ పాస్‌ బుక్‌లోనూ చిన్ని చిన్న లావాదేవీలు నమోదు కాకుండా ఉంటాయి. ప్రస్తుతం 15 బ్యాంక్‌లు యూపీఐ లైట్‌కు సపోర్ట్‌ చేస్తున్నాయి. గూగుల్‌ పేలో యూపీఐ లైట్‌ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుగా గూగుల్‌ పే యాప్‌లోని ప్రొఫైల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి, యూపీఐ లైట్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తరువాత వాలెట్‌లో కావాల్సిన మొత్తాన్ని లోడ్‌ చేసుకుని వినియోగించుకోవచ్చు. చిన్న మొత్తాల చెల్లింపుల విషయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement