Friday, October 18, 2024

UPI | పెరిగిన యూపీఐ లావాదేవీలు..

దేశంలో డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు జనవరి నుంచి జూన్‌ వరకు యూపీఐ పేమెంట్స్‌ సంఖ్య 78.97 బిలియన్లగా నమోదయ్యాయి.

గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 51.9 బిలియన్లతో పోల్చితే 52 శాతం వృద్ధిని నమోదు చేశాయి. లావాదేవీల విలువ పరంగా చూస్తే 12.98 లక్షల కోట్ల నుంచి 20.07 లక్షల కోట్లకు పెరిగాయి. విలువ పరంగా, సంఖ్యా పరంగా లావాదేవీల్లో ప్రముఖ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌ పే మొదటి స్థానంలో ఉంది.

గూగుల్‌ పే , పేటీఎం తరువాత స్థానాల్లో నిలిచాయి. లావాదేవీల మొత్తం విలువలో 81 శాతం ఇ-కామర్స్‌, గేమింగ్‌, యుటిలిటీస్‌, గవర్నమెంట్‌ సర్వీసెస్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ నుంచి వస్తున్నాయి.

యూపీఐ లావాదేవీల్లో సగటు టికెట్‌ సైజ్‌ విలువ మొదటి ఆరు నెలల కాలంలో 1,603 రూపాయల నుంచి 1,478 రూపాయలకు తగ్గింది. పర్సన్‌ నుంచి పర్సన్‌కు జరిగే లావాదేవీల విలువ 2,812 రూపాయల నుంచి 2,836 రూపాయలకు పెరిగింది. పర్సన్‌ టూ మర్చంట్‌కు జరిగే లావాదేవీల విలువ 4 శాతం తగ్గి, 667 నుంచి 643 రూపాయలకు తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement