Friday, November 22, 2024

Business: ఆగని బుల్‌ రన్‌.. ఐదు వారాలుగా లాభాల్లోనే

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమైన లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదవ వారం బుల్‌ రన్‌ను కొనసాగింది. రిస్క్‌ ఆస్తులలో గ్లోబల్‌ అమ్మకాల ఒత్తిడిని లెక్కచేయకుండా పాజిటివ్‌ ధోరణిని కొనసాగించింది. నిఫ్టీ ఒక దశలో 100పాయింట్ల నష్టం నుంచి కోలుకుని 12.25పాయింట్లు లాభాల్లోకి వచ్చి17,956 పాయింట్లవద్ద ముగిసింది. కొటక్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌ టి. భారతి ఎయిర్‌ టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐటీసీ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

అదే సమయంలో డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, ఇన్ఫీ, మహింద్ర అండ్‌ మహింద్ర,యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి. 5 జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు కారణంగా ఎయిర్‌టెల్‌ షేరు 1.59 శాతం పెరిగి రూ.733వద్ద ముగిసింది. గత మూడువారాలుగా మార్కెట్‌ బుల్‌ రన్‌లో కీలక భూమిక పోషిస్తూ వచ్చిన ఐటీ షేర్లు గురువారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విప్రో (1.83శాతం), ఇన్ఫీ (1.5శాతం), టీసీఎస్‌ (0.57శాతం) , హెచ్‌సీఎల్‌ (0.65 శాతం) చొప్పున నష్టపోయాయి. ఫిబ్రవరి నుంచి వరుస నస్టాలను చవిచూసిన భారతీయ మార్కెట్లు గత నెల రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్నాయి. దాదాపు 11 శాతం పెరిగాయి. నిఫ్టీ -50 సూచీ నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement