Thursday, November 21, 2024

Big story : లాక్‌డౌన్‌తో నిరుద్యోగం డబుల్‌.. మూడు నెలల్లో రెట్టింపు

కొవిడ్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత మూడు నెలల్లోనే, రూరల్‌ ఇండియాలో నిరుద్యోగ రేటు రెండింతలు అయిందని, ప్రభుత్వ పీరిడియాక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)వెల్లడించింది. కరోనా మహమ్మారికి ముందు, 2020 జనవరి నుంచి మార్చి వరకు గ్రామీణ నిరుద్యోగ సంఖ్య 6.8 శాతం ఉండగా, లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఏప్రిల్‌ నుంచి జూన్‌కు ఆ నిరుద్యోగ శాతం రెట్టింపు 12.1గా నమోదైనట్లు పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదిక వెల్లడించింది. భారత ప్రభుత్వం 2020, మార్చిలో మొదటిసారి జాతీయ లాక్‌డౌన్‌ను ప్రకటించినట్లు ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో, అదే సమయంలో నిరుద్యోగ రేటు 9శాతం నుంచి 20.9 శాతంకు పెరిగినట్లు ప్రభుత్వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వెల్లడించింది. పని లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు, చేయడానికి అందుబాటులో ఉన్న వారిని గుర్తించడం పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే పని.

ఈ సంస్థ సర్వే ప్రకారం రెగ్యులర్‌ లేదా జీతాలకు పనిచేసే ఉద్యోగులు, సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ వ్యక్తులు రెఫరెన్స్‌ ద్వారా ఉద్యోగాలు సంపాదించారు. వారిలో అధిక శాతం మందికి పని లేదు, సంపాదన లేదు. అయితే, వారు అందుబాటులో ఉన్న పనలు చేయలేదు. వారిని ఉద్యోగులుగా భావించారని నివేదిక పేర్కొంది. పని లేని వారిని, పని చేయడానికి అందుబాటులో ఉన్న వారిని నిరుద్యోగులుగా గుర్తించింది. నిరుద్యోగరేటు పెరుగుదల హెచ్చరికలని ఆ నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో, మొత్తంగా నిరుద్యోగం 10.5 శాతం 22.2 శాతం కు పెరిగింది. ఈ నిరుద్యోగ రేటు పట్టణప్రాంతాల్లో మరీ ఎక్కువగా 15 శాతం నుంచి 50.3శాతానికి పెరిగింది. ఈ స్టడీలో నిరుద్యోగ రేటు జనరల్‌ కేటగిరీ ప్రజలతో పోలిస్తే, అత్యధికంగా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ “(ఎస్సీ), షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) వర్గాలు, మరియు ముస్లింలలోనే ఎక్కువగా పెరిగిందని వెల్లడించింది.

రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వారిని విభజించింది. ఈ పాండమిక్‌ పీరియడ్లో క్యాజువల్‌ ఎంప్లాయిస్‌పై అధిక ప్రభావం చూపింది. ఆ ప్రభావం పట్టణ, నగర ప్రాంతాల్లో అత్యధికంగ చూపింది. అర్బన్‌ ప్రాంతాల్లో, వ్యవసాయేతర పనులు లేక పోవడం కారణంగా, ప్రజలకు ఉపాథి అవకాశాలు కరువయ్యాయి. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ మూత బడింది. దీంతో, నిరుద్యోగ రేటు తీవ్రస్థాయికి చేరిందని ఆ సర్వేలో వెల్లడించింది. మరోవైపు రెగ్యులర్‌ ఎంప్లాయిమెంట్‌ మాత్రం నిలకడగానే ఉందని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ మరియు జనరల్‌ కేటగిరీ వర్గాల్లో సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ శాతం పెరిగింది. ముస్లి వర్గాల్లో మాత్రం సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అతి తక్కువ శాతం నమోదయింది. ముస్లింవర్గాల్లో కరోనా లాక్‌డౌన్‌కు ముందు నిరుద్యోగం 9శాతం నమోదవగా, లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత మొదటి మూడు నెలల్లో 17శాతం నమోదయింది.

రెండు క్వార్టర్లలో రూరల్‌ ఏరియాల్లోని ముస్లింలలో నిరుద్యోగ రేటు 14 శాతం నుంచి 31 శాతంకు పెరిగినట్లు స్టడీ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 11 శాతం నుంచి 22 శాతానికి, జనరల్‌ కేటగిరీలో 10 శాతం నుంచి 20శాతానికి పెరిగింది. రూరల్‌ ఏరియాలో కులం, మతాలకు ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో ఈ రెండు అంశాలకు మరింత ప్రాధాన్యత పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. ప్రజలు వారి సామాజిక సర్కిళ్లలోనే ఒప్పందాలు కుదుర్చుకోవడం పెరిగింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల్లో పరస్పర సహకారం కరువైంది. అర్భన్‌ లేబర్‌ మార్కెట్‌తో పోలిస్తే, రూరల్‌ ఏరియాలో సామాజిక అసమానతల ప్రభావం అధికంగా ఉంటుంది.

- Advertisement -

ఇండియా మొత్తంపై లాక్‌డౌన్‌ ప్రభావం పరిశీలిస్తే, కొవిడ్‌ ప్రభావం పట్టణ ప్రాంతాలపై అధికంగా ఉంది. జాతీయ, రాష్ట్రస్థాయి లాక్డౌన్‌ల ప్రభావం నేరుగా పట్టణ ప్రాంతాల్లోని వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రొఫెషన్స్‌పై పడింది. దీంతో నిరుద్యోగం తీవ్రంగా ప్రబలింది. రెండు వరుస లాక్‌డౌన్‌లు ప్రకటించిన ఆరు నెలల కాలంలో, రెగ్యులర్‌ లేదా శాలరీ తీసుకునే ఉద్యోగులు వారి విధులకు హాజరు కాకపోవడం 5.9శాతం నుంచి 29.7శాతానికి పెరిగినట్లు ఆక్స్‌ఫామ్‌ స్టడీ ప్రకటించింది. అర్బన్‌ ఏరియాలో ఈపెరుగుదల హెచ్చరికగా ఉంది. అర్బన్‌లో 6.9 నుంచి 39.4 శాతం, ముస్లింలో ఆ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 11.8శాతం నమోదు కాఆ, ఏప్రిల్‌ -జూన్‌లో 40.9శాతానికి పెరిగినట్లు ఆక్స్‌ఫామ్‌ సర్వే ప్‌ రకటించింది. మహిళలకు ఉద్యోగావకాశాలు పెరగగా, పురుషులకు తగ్గడం విశేషం.

అర్బన్‌ ఏరియాల్లో మహిళలు అత్యధికంగా డొమొస్టిక్‌ హెల్ప్‌, అన్‌స్కిల్డ్‌ ఉద్యోగాల్లో ఉన్నారు. వారిలో ఎక్కువ హతశాతం మంది తక్కువ జీతానికి డైలీ సపోర్ట్‌ సర్వీసుల్లో పని చేస్తున్నారు. మధ్యతరగతి వర్గాల ప్రజలు మాత్రం పూర్తి జీతం, లేదా సగం జీతంతో, సౌకర్యంగానే గడిపినట్లు నివేదికలు ప్రకటించాయి. 2020 ఏప్రిల్‌ నుంచి జూన్‌ క్వార్టర్‌ను పరిశీలిస్తే, సోషల్‌ గ్రూపులు, ఎంప్లాయిమెంట్‌ కేటగిరీ ప్రజల వార్షిక సంపాదన తగ్గిందని స్టడీ వెల్లడించింది. రూరల్‌ ఏరియాల్లో నెల ఆదాయంతో పోలిస్తే, కొవిడ్‌ లాక్‌డౌన్‌లో 9శాతం ఉండగా, అర్బన్‌ ఏరియాలో ఆ రేటు 21శాతం నమోదయింది. మరీ ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో ఆ తగ్గుదల 13 శాతం ఉందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement