ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ అన్‌అకాడమీ మరో 350 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 10 శాతానికి సమానం. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ గౌరవ్ ముంజల్ తెలిపారు. ఇది కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పడంలేదని ఉద్యోగులకు పంపించిన ఇ-మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు.
తొలగించిన ఉద్యోగులకు నోటీస్ పీరియడ్‌తో పాటు, అదనంగా రెండు నెలల వేతనాన్ని ఇవ్వనున్నట్లు ముంజల్ తెలిపారు. వీటితో పాటు ఏడాది పాటు ఆరోగ్య బీమా కవరేజీని కొనసాగిస్తామన్నారు. మరో ఉద్యోగం పొందడానికి కావాల్సిన మద్దతు కూడా ఇస్తామని తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అన్‌అకాడమీ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది.
ఉద్యోగులను తొలగించిన ఆన్‌అకాడమీ
Advertisement
తాజా వార్తలు
Advertisement