హైదరాబాద్ : విశాఖపట్నంలో తమ సరికొత్త యువి స్పేస్ స్టేషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అల్ట్రా వయోలెట్ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది నగరానికి విప్లవాత్మక జోడింపుగా నిలుస్తుంది. ఈ సౌకర్యం అల్ట్రా వయోలెట్ విస్తరణ ప్రయాణంలో 6వ ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. బెంగళూరులోని ఫ్లాగ్‌షిప్ సెంటర్ తో ఇది చేరడంతో పాటుగా పూణే, అహ్మదాబాద్, కొచ్చి, హైదరాబాద్‌లలో ఇటీవల ప్రారంభమైన అల్ట్రావయోలెట్ కార్యకలాపాలకు ఇది నూతన జోడింపుగా నిలుస్తుంది. ఈ క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి డజను నగరాల్లో తమ కార్యకలాపాలను సంస్థ ప్రారంభించనుంది.
ఈసందర్భంగా అల్ట్రావయోలెట్ సీఈఓ అండ్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ…. విశాఖపట్నంలో యువి స్పేస్ స్టేషన్ ప్రారంభం అనేది చలనశీలత భవిష్యత్తును పునర్నిర్మించే తమ ప్రయాణంలో కీలకమైన ఘట్టమన్నారు. నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలతో పాటుగా పట్టణ అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారిస్తుండటంతో, విశాఖపట్నం తమ విస్తరణకు అనువైన ప్రదేశంగా నిలుస్తుందన్నారు. ఈ కొత్త సదుపాయం ఆవిష్కరణ పట్ల తమ నిబద్ధతను బలోపేతం చేయడమే కాకుండా, మొబిలిటీ పరంగా మరింత అనుసంధానించబడిన, స్వచ్ఛమైన, అధునాతన భవిష్యత్తు కోసం నగరం దృష్టికి మద్దతు ఇస్తుందన్నారు.
అల్ట్రావయోలెట్ సీటీఓ అండ్ సహ వ్యవస్థాపకుడు నిరాజ్ రాజ్మోహన్ మాట్లాడుతూ… భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవంలో ముందంజలో ఉండటానికి సిద్ధంగా ఉన్న విశాఖపట్నంలో తాము కార్యకలాపాలు ప్రారంభిస్తున్న వేళ, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలకు అనుగుణంగా ఉండటానికి తాము సంతోషిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇవ్వడం, విశాఖపట్నంను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సిటీగా గుర్తించాలనే కేంద్రం కార్యక్రమం ఓ గేమ్ ఛేంజర్ అన్నారు. ఈ అభివృద్ధి, ఫేమ్ -2 ప్రారంభంతో పాటు, స్థిరమైన ఈవీ పర్యావరణ వ్యవస్థకు పునాదిని బలపరుస్తుందన్నారు.